గుడ్ న్యూస్‌..రాజమౌళితో SSMB29

127
mahesh
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించారు దర్శకధీరుడు రాజమౌళి. తన నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. మహేశ్‌ బాబు కెరీర్‌లో ఇది 29వ సినిమా కాగా సినిమా క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఉన్నారు.

ప్ర‌స్తుతం జ‌క్క‌న్న టోరంటో ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ లో పాల్గొన్నారు. అక్క‌డ తాను త‌దుప‌రి చేయ‌బోతున్న సినిమా గురించి ఆయ‌న మాట్లాడుతూ.. మ‌హేష్‌తో గ్లోబ‌ల్ మూవీగా, యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ జోన‌ర్‌లో సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు తెలిపారు.

ఈ ఏడాది RRR వంటి పీరియాడిక్ మూవీ తెరకెక్కించి భారీ సక్సెస్ కొట్టారు రాజమౌళి. ఈ సినిమా హిట్‌తో మహేష్‌తో చేయబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -