అల్లూరి అతిథిగా పుష్పరాజ్!

93
arjun
- Advertisement -

హీరో శ్రీవిష్ణు నటిస్తున్న పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌ ‘అల్లూరి’. నిజాయితీకి మారు పేరు అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత సమర్పిస్తున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు నిజాయితీ గల పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఈ అల్లూరి సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది.

ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో ఈవెంట్‌కు గెస్ట్‌గా అల్లు అర్జున్‌ రానున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో రానుంది.

శ్రీ విష్ణూ ఎప్ప‌టిలాగానే ఈ సారి కూడా విభిన్న క‌థ‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. కాగా ఈసారి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను కూడా జోడించాడు.

- Advertisement -