ఆర్‌ఆర్‌ఆర్‌…న్యూ రిలీజ్ డేట్!

173
rrr
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోలుగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. సాధారణంగా రాజమౌళి సినిమాలంటేనే భారీ అంచనాలుంటాయి దీనికి తోడు ఎన్టీఆర్- చరణ్‌ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు జక్కన్న. అక్టో్బర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకురానుందని వెల్లడించగా ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్ధితుల నేపథ్యంలో విడుదల తేదీ వాయిదా పడింది.

అయితే సినిమా కోసం ఎదురుచూస్తున్న వారికి జక్కన్న తీపి కబురు అందించనున్నారట. మే 20న ఎన్టీఆర్ బర్త్త్ డే సందర్భంగా సినిమా న్యూ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించి మరింత జోష్ నింపనున్నాడట. ప్రస్తుతం ఈ వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతుండగా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది ఆర్ఆర్ఆర్.

- Advertisement -