ప్రభాస్‌ను జక్కన్నఫూల్‌ అనేశాడు..!

106

‘బాహుబలి’ డైరెక్టర్‌ రాజమౌళి ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఇదే సినిమా కోసం ఇందులో నటించిన హీరోయిన్లు ,హీరోలు కూడా అంతే కష్టపడ్డారనే చెప్పాలి. నిజానికి వారికున్న ఆఫర్లన్నీ…వదులుకొని మరీ బాహుబలి కోసం నాలుగు సంవత్పరాలపాటు కష్టపడ్డారు. ఇదిలా ఉంటే… బాహుబలి-2 సినిమా ప్రచారంలో  వీరందరినీ  తెగ పొగిడేశారు దర్శకుడు రాజమౌళి. బాహుబలి-2 కోసం ప్రతి ఒక్కరు ఎంత కష్టపడ్డారో  వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
 Rajamouli talk about prabhas in tamil audio launch
అయితే…’బాహుబలి’ కోసం అందరికంటే.. ఎక్కువ టైం ని కేటాయించాడు ప్రభాస్‌. అలాంటి ప్రభాస్‌ని రాజమౌళి ఫూల్‌ అనేశారు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్‌ షాక్‌ అయ్యారు. అసలు జక్కన్న డార్లింగ్‌ ప్రభాస్‌ని ఎందుకు పూల్‌ అనేశారు అనేగా మీ డౌట్‌..? ఎందుకంటే… ఒక సినిమా కోసం ఇన్ని సంవత్సరాలు కేటాయించిన ప్రభాస్ ముమ్మాటికీ ఫూలేనని చెప్పారు జక్కన్న.
 Rajamouli talk about prabhas in tamil audio launch
అంతేకాకుండా తనకు మంచి స్నేహితుడిగా ఉన్నందుకు ప్రభాస్‌కు రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. ఇక జక్కన్న అన్న మాటకి ప్రభాస్‌ కూడా రిప్లే ఇచ్చేశాడు. జక్కన్న  మాట్లాడిన అనంతరం స్జేజిపైకి వచ్చిన ప్రభాస్.. రాజమౌళి కోసం నాలుగు సంవత్సరాలు కాదు..ఏడు సంవత్సరాలైనా డేట్స్‌ ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించారు. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలు ఇవ్వడానికి కారణం రాజమౌళియేనని చెప్పారు ప్రభాస్‌.