దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ తెలుగు సినీ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుని కూడా సోంతం చేసుకుంది బాహుబలి. అయితే ఈ సినిమాకి ఆ అవార్డును గెలుచుకునే అర్హత లేదని చాలామంది అభిప్రాయపడుతుంటారు. బాహుబలి సినిమా కేవలం మార్కెటింగ్ విజయమే తప్ప ఈ సినిమాలో అంత దమ్ముకూడా లేదని వారి వాదన.
అయితే ఈ సినిమా మాత్రం కేవలం కలెక్షన్లకే పరిమితమైందని, బాక్సాఫీస్ లెక్కలతో ఈ సినిమాలో వున్న మైనస్ పాయింట్స్ అన్నీ కవర్ అయ్యాయని మరికొందరు భావిస్తున్నారు. నిజానికి బాహుబలి సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాపై వినిపించిన విమర్శలతో రాజమౌళి కూడా కాస్త కంగుతిన్నాడనే చెప్పాలి. అయితే ఇప్పుడు రాజమౌళి పనితనాన్ని గ్రేటెస్ట్ వర్క్‌గా ఒప్పుకోని విమర్శకులందరికీ ‘ బాహుబలి-2’ గట్టి సమాధానం ఇవ్వబోతోందట. ఈ సినిమాలో ఏవైతే లేవు అని భావించిన వారికి త్వరలో షాక్ ఇచ్చే పనిలో ఉన్నారంట ఈ చిత్ర టీమ్.
ఈ సినిమాలో ఎమోషన్స్ పీక్స్‌లో వుంటాయని, బాహుబలిలో మిస్ అయిందని చెప్పుకున్న హీరోయిజం ఇందులో పుష్కలంగా వుంటుందని ఆ చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా వుంది. ఏమీ లేదని చాలా మంది కామెంట్ చేసిన సినిమానే అంత సంచలనం చేస్తే, అన్నీ ఉన్న ఈ చిత్రం ఎంత పెద్ద సంచలనం అవుతుందనేది ఊహలకే అందడం లేదని యూనిట్టే అంటోందట. ఈమధ్య కాలంలో విస్తరించిన సినిమా మార్కెట్‌ని దృష్టిలో వుంచుకుని ఈ చిత్రాన్ని మతిపోయే ధరలకి కొన్న బయ్యర్లు కూడా భారీ లాభాలు వస్తాయని నమ్ముతున్నారంటే..మరి ఈ సినిమా ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.