టాలీవుడ్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడంలో ముందున్న వ్యక్తిగా జక్కన్న. అయితే టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 100మంది ప్రపంచవ్యాప్త ప్రభావశీలుర జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. దీంతో అభిమానులు సినీప్రముఖులు ఆయనకు అభినందనలు చెబుతున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సీత మీడియా మాట్లాడుతూ.. జక్కన్న ప్రశంసల వర్షం కురిపించింది.
మొదటిసారి రాజమౌళిని బహుబలి ప్రీమియర్‌లో కలిశాను. ఆ సినిమా కోసం చూస్తున్నంతసేపు ఆశ్చర్యపోయాను. ఆయన దర్శకత్వంలో పనిచేయాలని అప్పుడు నాలో ఒక ఆలోచన మొదలైందని చెప్పుకొచ్చారు. అయితే ఈ కోరిక ఆర్ఆర్ఆర్ తో తీరిపోయింది. ఆయన దగ్గర పనిచేయడమంటే స్కూల్‌కు వెళ్లడంతో సమానమని …ఎన్నో మంచి విషయాలు కొత్త అంశాలు నేర్చుకోవచ్చని తెలిపారు. నేను ఆయనను మాస్టర్ స్టోరీ టెల్లర్ అని పిలుస్తానని అన్నారు. ఒక కథను అద్బుతంగా తెరకెక్కించిగలరని అలాగే తన సినిమాల ద్వారా అందరినీ ఒక చోటికి చేర్చుతారని అన్నారు.
ఒకానొక సందర్భంలో నాకు నటన పరంగా ఏదైనా సలహా ఇవ్వాలని అడిగినప్పుడు..ఏ క్యారెక్టర్‌లో నటించినా..దానిని ప్రేమతో చేయాలని ఆయన చెప్పారు. సినిమా ప్రేక్షకాదరణ పొందకపోయినా..మనం చేసిన పాత్ర మాత్రం జనాలకు గుర్తిండిపోయేలా నటించాలన్నారు అని చెబుతూ జక్కన్నను పొగడ్తలతో ముంచెత్తారు.
ఇవి కూడా చదవండి…