జక్కన్న బాలీవుడ్‌కి షిఫ్ట్‌..?

139
rajamouli

భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి తెలియచెప్పిన డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి. మగధీర, ఈగ, బాహుబలి వంటి చిత్రాలతో జక్కన్న సత్తా చాటారు. త్వరలో బాహుబలి కంక్లూజన్ తో మరోసారి రికార్డులు క్రియేట్ చేయడానికి దర్శకధీరుడు సిద్ధమవుతున్నాడు. ఈనెలాఖరులోగా బాహుబలి2 చిత్రీకరణ పూర్తికానుంది. దీంతో రాజమౌళి నెక్ట్స్ మూవీపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే.. ఈగ2, గరుడ, మహాభారతం ఇలా చాలా సినిమాలను లైన్లో పెట్టినట్టు రకరకాల వార్తలు వచ్చాయి. అయితే.. రాజమౌళి నెక్ట్స్ మూవీ బాలీవుడ్ మిస్టర్ ఫర్పెక్ట్ అమీర్ ఖాన్ తో ఉంటుందని తెలుస్తోంది.

rajamouli

ఓ మంచి స్టోరీ లైన్ తో అమీర్ తో సినిమా తీసే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు బీ టౌన్ లో కూడా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే రాజమౌళి బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నట్లవుతుంది. అమీర్ ఖాన్ తో చేసే ఈ సినిమాకు కూడా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తారని సమాచారం. తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ కూడా సిద్ధమైందని తెలుస్తోంది. మొత్తానికి దర్శకధీరుడు బీటౌన్ లోకి అడుగుపెట్టనుండడం.. టాలీవుడ్ సినీ లవ్వర్స్ కి భలే సంతోషాన్నిస్తోంది.