ఆ విషయంలో తొందరేం లేదు..

94
Upasana

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ సినిమాలతో పాటు..ఇంట్లో తండ్రి పాత్ర కూడా పోషిస్తున్నాడు. ఇద్దరు పిల్లలకు తండ్రి అయి..పుత్ర వాత్సల్యం పొందుతున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ బాబుకు తండ్రి అయ్యాడు. అంతేకాదు అభయ్ రామ్ వచ్చాక తన జీవితం మారిపోయిందని. మంచి హిట్స్ పడుతున్నాయని తారక్ చాలా సార్లే చెప్పాడు. ఇలా  టాలీవుడ్‌ యువ హీరోలంతా పెళ్లిల్లు చేసుకుని పిల్లలను కనేస్తూ ఉంటే.. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మాత్రం తాను అప్పుడే తండ్రి కావాలనుకోవడం లేదంటున్నాడు. ‘‘నేనింకా చిన్న పిల్లాడినే. తండ్రి కావడం గురించి తొందర పడడం లేదు. నా భార్యతో ఏకాంతంగా గడిపేందుకు మరింత సమయం కావాలి’’ అని రామ్‌చరణ్‌ తెలిపాడు.

Ram Charan
కాగా, ‘ధృవ’ హిట్‌తో మంచి జోష్‌లో ఉన్న చెర్రీ గతంలో తాను చేసిన పొరపాట్ల గురించి మాట్లాడాడు. గతంలో సినిమాల ఎంపికలో చాలా పొరపాట్లు జరిగినట్టు అంగీకరించాడు. జడ్జిమెంట్‌ లోపాల వల్లే ఆ సినిమాలు ఒప్పుకున్నట్టు తెలిపాడు. రీమేక్‌లు చేయడం గురించి మాట్లాడుతూ.. ‘ఎవరినీ ఆకట్టుకోని ఒరిజినల్స్‌ చేయడం కంటే.. ఆకట్టుకునే రీమేక్‌లు చేయడం ఉత్తమం’ అని వ్యాఖ్యానించాడు. అవసరమైన సమయంలో ‘ధృవ’ మంచి విజయం సాధించడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఇప్పటి నుంచి సంక్రాంతి వరకు తాను ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమా పనులతో బిజీగా ఉంటానని, ఫిబ్రవరి నుంచి కొత్త సినిమా మొదలెడతానని తెలిపాడు. ఒక కొడుకుగానే కాకుండా ఓ నిర్మాతగా కూడా తనకు ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమా చాలా ప్రత్యేకమని అన్నాడు.

Upasana