- Advertisement -
అంతా అనుకున్నట్లే జరిగింది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.మునుగోడు ప్రజల కోసమే తాను రాజీనామా చేశానని ….తన రాజీనామా మునుగోడు ప్రజలకు మేలు చేస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ తాను ఎప్పుడూ అన్యాయం చేయలేదన్నారు. సోనియాను తిట్టిన వ్యక్తిని అందలం ఎక్కించారని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. బయటి నుంచి వచ్చిన వారికింద పనిచేయాలా అన్నారు. కాంగ్రెస్ పై గౌరవం ఉన్నందునే ఇన్నాళ్లూ పార్టీలో ఉన్నానని …బయటి నుంచి వచ్చిన వ్యక్తిని సీఎం చేయాలా అని నిలదీశారు.
ఎవరు గెలుస్తారో మునుగోడు ప్రజలే నిర్ణయిస్తారని …ప్రజలు కోరుకుంటేనే మనుగోడు నుండి పోటీ చేస్తానని తెలిపారు.
- Advertisement -