- Advertisement -
కాంగ్రెస్ పార్టీని వీడటంపై క్లారిటీ ఇచ్చారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్. సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో తాను కొనసాగేది.. లేనిది.. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు.ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధిష్ఠానానిదే అన్నారు. పదవుల కోసం పార్టీ మారే ఆలోచన తనకు లేదని తెలిపారు.
అయితే కేసీఆర్‌ను గద్దె దించే వరకు రాజకీయాల్లో కొనసాగుతానని తేల్చిచెప్పారు. ఉద్యమాలు, ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రేవంత్‌కు పీసీసీ పగ్గాలు అప్పగించిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీతో దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేగాదు పలుమార్లు కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌పై విమర్శలు కూడా గుప్పించారు.
- Advertisement -