మాస్ మహారాజా గా పెరు తెచ్చుకున్న హీరో రవితేజ. అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని స్టార్ట్ చేసి ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి కష్టపడి హీరో అయ్యాడు రవితేజ. కెరీర్‌లో జయపజయలతో సంబంధం లేకుండా తనదైన శైలిలో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. ఇన్నేళ్ళ సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రలు చేసిన రవితేజ మొదటిసారి ఒక చూపులేని వాడి పాత్రలో కనిపించబోతున్నాడు. దిల్ రాజు నిర్మాతగా పటాస్ మరియు సుప్రీమ్ వంటి హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ “రాజా ది గ్రేట్” సినిమాతో రాబోతున్నాడు.
గత కొంత కాలంగా ఈ హీరోకి సరైన విజయాలు దక్కడం లేదు. అందుకే ఒక ప్రయోగాత్మకమైన చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమాలో రవి తేజ బ్లైండ్ క్యారెక్టర్ తో తన జీవితంలోని సమస్యలను ఎలా గెలుస్తాడు అనేది ప్రధానాంశం.
అయితే నలుగురికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని ప్రముఖ నేత్రాలయా విద్యాసంస్థలు నిర్వహించిన 10 వార్షికోత్సవ వేడుకలో “రాజా ది గ్రేట్” యూనిట్ హాజరైంది. చూపులేని ఎంతోమందికి విద్యను అందిస్తున్న నేత్రాలయా విద్యాసంస్థను రవితేజ తో పాటు నిర్మాత దిల్ రాజు దర్శకుడు అనిల్ రవి పూడి కూడా సందర్శించారు. ఈ వేడుకల్లో మరికొంతమంది ఆత్యాద్మీక గురువులు కూడా హాజరయ్యారు.