రాజాసింగ్‌కు షాక్..FB,ఇన్‌స్టా అకౌంట్లు బ్లాక్

23
- Advertisement -

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మెటా సంస్థ షాకిచ్చింది. ఆయన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగించింది. ఆయన పేరుతో ఉన్న రెండు ఫేస్‌బుక్ పేజీలు, మూడు ఇన్‌స్టా అకౌంట్లను తొలగించింది.

సోషల్‌ మీడియాలో ధ్వేష పూరిత ప్రసంగాలను వ్యాప్తి చేస్తున్నట్లు ఇండియా హేట్‌ ల్యాబ్‌ (IHL) నివేదిక వెల్లడించిన వారం తర్వాత మెటా ఈమేరకు చర్యలు తీసుకున్నది. తొలగించిన ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో సుమారు 10 లక్షల మందికిపైగా సభ్యులు ఉండగా, ఇన్‌స్టా అకౌంట్లలో లక్షా 55 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.

హిందువులను లక్ష్యంగా చేసుకొని సెలెక్టివ్‌ సెన్సార్‌షిప్‌ దాడి చేస్తోంది. నా కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు, మద్దతుదారుల సోషల్‌ మీడియా ఖాతాలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ బ్లాక్‌ చేయడం దురదృష్టకరం అన్నారు. రాహుల్‌గాంధీ చేసిన ఫిర్యాదు ఆధారంగా నా అధికారిక ఖాతాలకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:హిమాలయాలకు వెళ్తున్నారా?: పవన్‌తో మోదీ

- Advertisement -