రాజాసాబ్..టీజర్ లీక్!

9
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న చిత్రం రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిలో క్యూరియాసిటీని పెంచేసిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు ఇండియన్ టాప్ మూవీ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

జూన్‌ 16న ఈ సినిమా టీజర్‌ రిలీజ్ కానుండగా తాజాగా టీజర్ కు సంబంధించిన కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి. దీనిపై మూవీ టీమ్ స్పందించింది. లీక్‌ కంటెంట్‌ను షేర్‌ చేసేవాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పింది.

ఎవరైనా రాజాసాబ్‌ కంటెంట్‌కు సంబంధించిన అన్ అఫిషియల్ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తే ఆ సోషల్ మీడియా అకౌంట్ ను వెంటనే బ్లాక్ చేసేలా అన్ని చేసేలా చర్యలు తీసుకుంటామని మూవీ టీమ్ వార్నింగ్ ఇచ్చింది.

Also Read:ఇరాన్-ఇజ్రాయెల్ వార్..బంగారం భగభగ!

- Advertisement -