- Advertisement -
మారుతి – ప్రభాస్ దర్శకత్వంలో రాజాసాబ్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. డిసెంబర్ 5న సినిమా థియేటర్లలో రాబోతోందని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది.
రాజా సాబ్ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. టీజర్‌ను జూన్ 16న ఉదయం 10 గంటల 52 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
దీంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్, రిద్ది కుమార్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read:కరోనా..జాగ్రత్తలు తప్పనిసరి!
- Advertisement -

