రివ్యూ : రాజ రాజ చోర‌

260
sree vishnu

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాజ రాజ చోర‌’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్‌. హిసిత్‌ గోలి ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 19న ఇవాళ సినిమా ప్రేక్షకుల ముందుకురాగా రాజ రాజ చోరతో ఏ మేరకు ఆకట్టుకున్నారో వేచిచూడాలి.

క‌థ‌:

భాస్క‌ర్‌(శ్రీవిష్ణు) ఓ జెరాక్స్ షాపులోప‌నిచేస్తుంటాడు. అబ‌ద్దాలు చెప్పి విద్య‌(సునైన‌)ను పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ కొడుకు పుడ‌తాడు. త‌న‌కు అబ‌ద్దం చెప్పి పెళ్లి చేసుకున్నందుకు కేసు వేస్తాన‌ని, అలా చేయ‌కుండా ఉండాలంటే త‌న‌ను లాయ‌ర్ కోర్సు చ‌దివించాల‌ని భాస్క‌ర్‌ను విద్య బెదిరించి చ‌దువుకుంటూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే తాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని చెప్పి, సంజ‌న‌(మేఘా ఆకాశ్‌)తో ప్రేమలో పడతాడు. ప్రేయ‌సి కోసం, భార్య చ‌దువు కోసం భాస్క‌ర్ చిన్న చిన్న దొంగ‌త‌నాలు చేస్తుంటాడు. ఓ పెద్ద దొంగ‌తనం చేసి, ప్రేయ‌సితో వెళ్లిపోవాల‌ని ప్లాన్ చేసుకుంటాడు భాస్క‌ర్‌. ఈ క్రమంలో ఏం జరుగుతుంది…? పోలీసుల‌కు దొరికిన భాస్క‌ర్ ఎలా త‌ప్పించుకుంటాడు? అనేదే సినిమా కధ..

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,కథనం,శ్రీ విష్ణు నటన,కామెడీ. భ‌ర్త‌గా, చోరుడిగా, ప్రియుడిగా శ్రీవిష్ణు త‌న‌దైన స్టైల్లో మూడు వేరియేష‌న్స్‌ను చూపిస్తూ క్యారెక్ట‌ర్‌ను అద్భుతంగా క్యారీ చేశాడు. ఇక మేఘా ఆకాశ్, సునైన .. ఇద్ద‌రి పాత్ర‌ల్లో సునైన పాత్ర‌కే ఎక్కువ ప్రాధాన్య‌త క‌నిపించింది. రవిబాబు,గంగ‌వ్వతో పాటు మిగితా నటీనటులు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్‌:

పెద్దగా ట్విస్ట్‌లుగా లేకపోవడం సినిమాలో మైనస్ పాయింట్స్‌.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా బాగుంది. వివేక్ సాగ‌ర్ సంగీతం అందించిన పాట‌లు ,నేప‌థ్య సంగీతం బాగుంది. వేద రామ‌న్ సినిమాటోగ్ర‌ఫీ,ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

అబ‌ద్దాలు బంధాల‌ను నిల‌ప‌వు అనే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు హ‌సిత్ గోలి తెరకెక్కించిన చిత్రం రాజ‌రాజ‌చోర‌. కామెడీ, శ్రీవిష్ణు నటన సినిమాకు ప్లస్ కాగాముఖ్యంగా గంగ‌వ్వ‌, శ్రీవిష్ణు మ‌ధ్య వ‌చ్చే డైలాగ్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తాయి. మొత్తంగా ఈ వీకెండ్‌లో చూడదగ్గ చిత్రం రాజరాజచోర.

విడుదల తేదీ:19/08/2021
రేటింగ్: 2.5 /5
న‌టీన‌టులు: శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్‌
సంగీతం: వివేక్ సాగ‌ర్‌
నిర్మాత‌లు: టి.జి.విశ్వ ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌
ద‌ర్శ‌క‌త్వం: హితేశ్ గోలి