భారీ వసూళ్లతో రాజరాజ చోర..

144
raja raja chora

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ రాజ రాజ చోర‌. ఈ సినిమా ఆగ‌స్ట్ 19న విడుద‌లై మంచి పాజిటివ్‌టాక్‌తో దూసుకుపోతుంది.వ‌రల్డ్‌వైడ్ గా ప్రేక్షకుల నుండి యునామిన‌స్‌గా అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. క‌న్న‌డ‌లో కూడా మంచి క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

సెకండ్ లాక్ డౌన్ తర్వాత ఈ మూవీ హైయెస్ట్ రేటింగ్ అండ్ మోస్ట్ లవ్డ్ మూవీగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బుక్ మై షో యాప్ లో 86%, పే టీఎమ్ లో 92% రేటింగ్ నమోదు చేసుకోవడం విశేషం.

శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్, సునైనా ప్రధాన పాత్రలు, తనికెళ్ల భరణి, సత్య సహాయక పాత్రలు పోషించారు. హసీత్ గోలీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లపై టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. వివేక్ సాగర్ బాణీలు అందించగా, సినిమాటోగ్రఫీ వేద రామన్ శంకరన్ నిర్వహించారు.