తెలంగాణకు వర్ష సూచన : వాతావరణ శాఖ

2633
rains
- Advertisement -

రాగల మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షములు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షములు పడే అవకాశముందని తెలిపింది. ఈ రోజు, రేపు తెలంగాణలో ఉరుములు మరియు మెరుపులుతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

నిన్న దక్షిణ ఝార్ఖండ్ & పరిసరాల్లో ఉన్న ఆవర్తన ప్రభావంతో, ఉత్తర ఒరిస్సా మరియు ఆనుకుని ఉన్న దక్షిణ జార్ఖండ్ & గాంగ్ టక్, వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతుంది . ఈ అల్ప పీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనము సగటు సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశకు ఒంపు తిరిగి ఉండటం వల్ల తెలంగాణలో అక్కడక్కడ కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి భారీ వర్షములు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -