మరో 3 రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు..

26

గత వారం రోజులుగా తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా పలు జిల్లాలో మోస్తరు వర్షాలు పడ్డాయి. కాగా, మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగలవారి పేటలో అత్యధికంగా 87.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మహబూబాబాద్ జిల్లాలోని ఉప్పరగూడెంలో 68.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, ములుగు, హైదరాబాద్, మేడ్చల్ మాల్కాజిగిరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ చెదురుమదురు వానలు కురిశాయి.