- Advertisement -
రాగల 2 రోజులలో మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, నైఋతి బంగాళాఖాతం మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరి కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మొత్తం ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని తూర్పు ప్రాంతాలలో సుమారుగా జూన్ 8వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో రాగల మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
- Advertisement -