IMD:రాగల ఐదు రోజులు తెలంగాణలో వర్షాలు

24
- Advertisement -

రోహిణి కార్తె వచ్చిందంటే చాలు వర్షాల కోసం ఎదురుచూపులు… రైతులు పొలం పనుల్లో మునిగిపోతారు. అయితే తాజాగా భారత వాతవరణశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రాగల ఐదు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈమేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

సోమవారం పలుచోట్ల పొడి వాతావరణం ఏర్పడుతుందని, మరికొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కొన్నిచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం నుంచి జూన్‌ 3 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని, పలుచోట్ల ఈదురుగాలులతో వానలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.

Also Read: ఛీ మోడీజీ.. దేశానికి సిగ్గు చేటు !

- Advertisement -