రాష్ట్రంలో రాగల 3రోజుల పాటు భారీ వర్షాలు..

221
Rains
- Advertisement -

నిన్న విదర్భ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తం ఈ రోజు బలహీన పడింది. ఈ క్రమంలో తౌక్టే తుఫాను ఈ రోజు ఉదయం 08:30 నిమిషములకి గోవాకి దక్షిణ నైరుతి దిశగా 330 కి.మి దూరంలో కేంద్రీకృతమైంది. ఇది క్రమంగా బలపడి రాగల 6 గంటలలో తీవ్రతుఫానుగా ఏర్పడి తరువాత తదుపరి 12 గంటలలో మరింత బలపడి అతి తీవ్రతుఫానుగా మారి ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిచి,గుజరాత్ తీరాన్ని పోర్బందర్ – నలియాల మధ్య 18వ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రం తీరాన్ని దాటే అవకాశం వుంది.

తెలంగాణలో వాతావరణ సూచన: ఈ రోజు,రేపు(15,16వ తేదీలు) తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాలలో మరియు ఎల్లుండి(17వ తేదీ) ఒకటి, రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశములు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.

వాతావరణహెచ్చరికలు: రాగల 2 రోజులు (15,16వ.తేదీలు) ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులు (గంటకి 30 నుండి 40 కి మి వేగం) కూడిన వర్షం (ముఖ్యంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాలలో), మరియు ఎల్లుండి(17వ తేదీ) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఒకటి,రెండు ప్రదేశాలలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అవకాశములు ఉన్నాయి.

తౌక్టే తుఫాను ప్రభావం: తెలంగాణా రాష్ట్రంలో ఈ రోజు,రేపు (15,16వ తేదీలలో) తుఫాను ప్రభావం వుండే అవకాశం వుంది. ( ముఖ్యంగా ఈ రోజు దక్షిణ,నైరుతి జిల్లాలపై,రేపు(16వ తేదీ) తెలంగాణలో పశ్చిమ వైపు జిల్లాలపై ప్రభావం ఎక్కువగా వుండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

- Advertisement -