ఉత్తరఖాండ్‌లో మళ్లీ వరద బీభత్సం సృష్టించింది. చమోలీ జిల్లా నందానగర్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో భారీ వరదల్లో గల్లంతయిన పదుల సంఖ్యలో గల్లంతయ్యారు.
పలు ఇళ్లు, భవనాలు ధ్వంసం అయ్యాయి. పెద్దపెద్ద భవనాలు నెలకొరిగాయి. వరదల్లో కొట్టుకుపోతున్న ఇళ్ల నుంచి ఇద్దరిని రక్షించింది రెస్క్యూ బృందం. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ స్థానిక అధికారులు, SDRF, పోలీస్ బృందాలు వెంటనే చర్యలు ప్రారంభించాయి. తాను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. అందరి భద్రత కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి మరింత విషమంగా మారింది. మంగళవారం ఉదయం జరిగిన కొండచరియల విపత్తులో కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.భారీ వర్షాల హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను తరలించేందుకు రక్షణ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు వందలాది మంది వర్షం సంబంధిత ఘటనల్లో మృతి చెందగా, ఈ సారి వర్షాల తీవ్రత సాధారణ మాన్సూన్ కంటే ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.
గురువారం ఉదయం చమోలి జిల్లా నందనగర్‌లో భారీ వర్షాల కారణంగా పలువురు ఇళ్లు మట్టికింద కూరుకుపోయాయి. కనీసం 12 మంది గల్లంతయ్యారని జిల్లా అధికారులు తెలిపారు. వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
Also Read:మావోల పేరుతో సంచలన లేఖ!

