తెలంగాణకు వర్ష సూచన.. !

174
rain
- Advertisement -

ఎండవేడిమి నుండి ప్రజలకు కాసింత ఉపశమనం లభించింది. ఒక్కసారిగా రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. ఉప‌రి‌తల ద్రోణి కార‌ణంగా రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం విదర్భ పరిసర ప్రాంతాలకు ఉపరితల ఆవర్తనం విస్తరించడంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ద్రోణి ప్రభావంతో ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌, నిర్మల్‌, మంచి‌ర్యాల, నిజా‌మా‌బాద్‌, జగి‌త్యాల, కరీంనగర్‌, రాజన్న సిరి‌సిల్ల జిల్లాల్లో అక్కడక్కడ ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన వర్షం కురు‌వొ‌చ్చని పేర్కొన్నారు. ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారింది.

- Advertisement -