IND vs PAK:మ్యాచ్‌కి వరణుడు అడ్డంకి?

6
- Advertisement -

భారత్–పాకిస్తాన్ మధ్య అత్యంత ఆసక్తికరమైన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. తొలుత బహిష్కరణ నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ తర్వాత యూటర్న్ తీసుకోవడంతో మ్యాచ్ జరగడం ఖరారైంది. అయితే ఇప్పుడు వాతావరణం ఈ హై వోల్టేజ్ పోరుకు ఆటంకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం కొలంబోలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో పలు వార్మప్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. టోర్నీలో ఇప్పటివరకు ప్రధాన మ్యాచ్‌లు అంతరాయం లేకుండా సాగినప్పటికీ, భారత్–పాక్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే లేదా మధ్యలో నిలిచిపోయే అవకాశం ఉందని అంచనా.

ఫిబ్రవరి 15 ఆదివారం కొలంబోలో 50 శాతం వర్షం అవకాశముంది. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. దీంతో మ్యాచ్ ప్రారంభం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రాత్రి మేఘాలు చెదిరే అవకాశం ఉన్నప్పటికీ, రాత్రి 8 గంటల సమయంలో స్వల్ప వర్షం ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, అభిమానులు మరియు నిర్వాహకులు ఆదివారం వర్షం తగ్గాలని ఆశిస్తున్నారు.

Also Read:సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

- Advertisement -