పోలీస్ నిర్లక్ష్యం..రూ.262 కోట్ల భారీ పరిహారం!

6
- Advertisement -

అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కుటుంబానికి భారీ పరిహారం ప్రకటించబడింది. 2023 జనవరిలో సియాటెల్ నగరంలో రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల జాహ్నవిని వేగంగా వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అమెరికాలోనే కాకుండా భారతదేశంలో కూడా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

ప్రమాదం తర్వాత వెలుగులోకి వచ్చిన ఆడియోలో పోలీస్ అధికారి డేనియల్ అడరర్ “ఆమె చనిపోయింది… ఆమె చాలా మామూలు మనిషి… 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది” అంటూ నవ్వుతూ మాట్లాడిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలు బాధిత కుటుంబాన్ని మాత్రమే కాకుండా ప్రజలను కూడా తీవ్రంగా కలిచివేశాయి. పోలీస్ వ్యవస్థలో బాధ్యతా రాహిత్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

Also Read:సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

దీంతో జాహ్నవి కుటుంబం న్యాయం కోసం పోరాటం కొనసాగించింది. తాజాగా సియాటెల్ నగర యంత్రాంగం పోలీస్ అధికారి నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ మరణానికి సంబంధించి రూ.262 కోట్ల భారీ పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం బాధిత కుటుంబానికి కొంతమేర న్యాయం జరిగినట్లు భావిస్తున్నారు. అయితే, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -