- Advertisement -
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ మద్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. మొదట 9.5 ఓవర్లలో 46/0 వద్ద మ్యాచ్ నిలిచిపోగా.. 33.1 ఓవర్ల తర్వాత వరుణుడు మళ్లీ అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. మ్యాచ్‌లో నిలిపివేసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (77; 108 బంతుల్లో 6×4, 1×6) శతకానికి చేరువయ్యాడు. 32 ఓవర్ల లోపు ఆమిర్ వేసిన 25 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు చేశాడు. స్పిన్‌లో మాత్రం దూకుడు కనబరుస్తున్నాడు. సారథి విరాట్ కోహ్లీ (24; 27 బంతుల్లో 2×4) సమయోచితంగా ఆడుతున్నాడు. దీంతో, ఈ మ్యాచ్ ను 48 ఓవర్లకు నిర్వహకులు కుదించారు.
- Advertisement -