రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షం..

16
Rain forecast

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం తెలిపింది. ఇంటీ‌రి‌యర్ తమి‌ళ‌నాడు నుంచి ఇంటీ‌రి‌యర్‌ కర్ణా‌టక దాకా 0.9 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు ఉన్న ఉప‌రి‌తల ద్రోణి బల‌హీ‌న‌ప‌డింది. వాతా‌వ‌ర‌ణంలో వచ్చిన మార్పులతో గురు‌వారం హైద‌రా‌బాద్‌ కాస్త చల్లబడింది.

ఉదయం ఆకాశం మేఘా‌వృ‌తమై ఉన్నది. అక్కడక్కడ చిరు జల్లులు కురి‌శాయి. దక్షిణ నైరుతి దిశ‌నుంచి తక్కువఎత్తులో రాష్ట్రం‌లోకి వీస్తున్న గాలులతో వాతా‌వ‌రణం కాస్త చల్లగా మారింది. కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్ జిల్లా సిర్పూర్‌ (యూ)లో 10.6 మిల్లీ‌మీ‌టర్ల వర్షం కురి‌సి‌నట్టు టీఎ‌స్‌‌డీ‌పీ‌ఎస్‌ తెలి‌పింది. మరో వైపు పలు జిల్లాల్లో రాష్ట్రంలో అత్యధికంగా కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌ జిల్లా ఆసి‌ఫా‌బాద్‌, వాంకి‌డిలో 41 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది.