రాబోయే విపత్తుని ముందే గుర్తించొచ్చు..

16
- Advertisement -

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రోజురోజుకీ విస్తరిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అనివార్యంగా మారింది. సరికొత్త టూల్స్‌తో అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రకృతి పసిగట్టే ఏఐ టూల్‌ను అభివృద్ధి చేశారు. ఇంతకీ ఈ టెక్నాలజీ ఉపయోగం ఏంటి.? ఇప్పడు తెలుసుకుందాం..

ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా వరదల వల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం పెరిగిపోతోంది. దీనికి చెక్‌ పెట్టేందుకే కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది

వరదలను వీలైనంత ముందుగా గుర్తిస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చని తెలిసిందే. ముందుగా అప్రమత్తమైతే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. అందుకే వారం ముందే వరదలను గుర్తించే ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్‌

ఫ్లడ్‌ హబ్‌ పేరుతో కొత్త ఏఐ టూల్‌ను తీసుకొచ్చొంది. వారం ముందుగానే వరదలు వచ్చే అవకాశాన్ని పసిగట్టడం ఈ టూల్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. వాతావరణ అంచనాల ఆధారంగా ఈ టూల్ పని చేస్తుంది.

ప్రాథమికంగా ఈ టూల్‌ను భారత్‌లో పరీక్షించారు. అనంతరం ఈ టూల్‌ను 80కిపైగా దేశాల్లో విస్తరించారు. ఈ టూల్‌ 1800కిపైగా ప్రాంతాల్లో వరదలను అంచనా వేయగలదని గూగుల్ చెబుతోంది.

Also Read:Chiru:ప్రతినిధి 2..ఇంటెన్స్ టీజర్‌

- Advertisement -