త్వరలో గజ్వేల్‌కు రైలు రాబోతుందని తెలిపారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేసిన సందర్భంగా మాట్లాడిన హరీష్ తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అన్నారు. కేంద్రంలో టీఆర్ఎస్ కీలకం కాబోతుందని తెలిపిన హరీష్ మెదక్ పార్లమెంట్ ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డికి అవకాశం ఇచ్చినందుకు హరీష్‌రావు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు హరీష్. సీఎం కేసీఆర్ కోనాయిపల్లి వేంకటేశ్వరుని ఆశీస్సులతో అన్ని పనుల్లో విజయం సాధించారు. వేంకటేశ్వరుని దయతో కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తారు అని హరీష్‌రావు తెలిపారు.
తర్వాత మెదక్ కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను కొత్త ప్రభాకర్‌రెడ్డి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.