సీబీఐ ఈ పేరు వింటేనే అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. కానీ అలాంటి సీబీఐ ప్రధానా కార్యాలయంలోనే తనిఖీలు జరిగితే..?కార్యాలయాన్ని సీజ్ చేస్తే..?అవునూ మీరు వింటుంది నిజమే.ఢిల్లీలోని సీబీఐ హెడ్ ఆఫీస్‌పై అధికారులు రైడ్స్ నిర్వహించారు.
అర్థరాత్రి 2 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు సోదాలు నిర్వహించిన అధికారులు డైరెక్టర్,స్పెషల్ డైరెక్టర్ చాంబర్లను సీజ్ చేశారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో అధికారులు ఎవరిని లోపలికి అనుమతించలేదు.
అయితే సీబీఐ కార్యాలయంలో ఏం జరుగుతుందో చెప్పడానికి ఉన్నతాధికారులు నిరాకరించారు. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్‌ల మధ్య వివాదం తారస్ధాయికి చేరడంతో వీరిని సెలవులపై పంపించారు అధికారులు. రాత్రికి రాత్రే నాగేశ్వరరావును తాత్కలిక డైరెక్టర్‌గా నియమించడం..ప్రధాన కార్యాలయంపైనే తనిఖీలు జరగడం చర్చనీయాంశంగా మారింది.