సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో తోబ తోబ.. అంటూ పవన్ కళ్యాణ్ తో.. ఖైదీ నెం.150 చిత్రంలో రత్తాలు …సాంగ్ కి మెగాస్టార్ చిరంజీవితో కలిసి చిందేసింది లక్ష్మీరాయ్. ఈ రెండు పాటలు లక్ష్మీరాయ్ కి మరిన్ని ఐటమ్ సాంగ్ అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి.
తాజా న్యూస్ ఏంటంటే.. లక్ష్మీరాయ్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఆడిపాడనుందని టాక్ వినిపిస్తోంది.బాబి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఐటమ్ పాట కోసం లక్ష్మీరాయ్ ని తీసుకుందామని అంటున్నాడట ఎన్టీఆర్. తనూ తీసిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన లక్ష్మీరాయ్ అంటే డైరెక్టర్ బాబి కూడా సుముఖంగానే ఉన్నాడట.
కాబట్టి ఎన్టీఆర్ తో ఐటమ్ పాటకు లక్ష్మీరాయ్ చిందేయడం ఖాయమని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే లక్ష్మీరాయ్ పంటపండినట్టే. మొత్తానికి చాలా కాలం తరువాత తెలుగులో ఐటెం సాంగ్స్ కోసం ఒకే భామను నమ్ముకుంటున్నారు మన హీరోలు.