ప్రిన్స్ మూవీ వాయిదా… ఎందుకో తెలుసా..!

206
Mahesh Babu, AR Murugadoss' film
- Advertisement -

బాహుబలితో పోటీ పడలేక మహేష్ లాంటి స్టార్ హీరో కూడా సైడ్ అయిపోయాడు. బాహుబలి 2 ఏప్రిల్ 28 రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.  అదే రోజు మహేష్… నటిస్తున్న సంభవామి మూవీని కూడా రిలీజ్ అవుతుందని మొదటి నుంచి వార్తలు వినిపించాయి.  పోకిరి హిట్ నుంచి ఏప్రిల్ 28 మహేష్ బాబుకు సెంట్ మెంట్ గా మారింది.
Mahesh Babu, AR Murugadoss' film
అయితే.. మహేష్ 28నే కాదు అసలు ఏప్రిల్ నెలలోనే రావడంలేదు. ఆ నెలలో బాహుబ‌లి సినిమా విడుద‌ల కానుండడంతో మహేష్ చిత్రాన్ని జూన్‌లో విడుద‌ల చేస్తే బెట‌ర్ అని భావిస్తున్నారని సమాచారం. 2015లోనూ మహేష్ నటించిన శ్రీమంతుడు విషయంలోనూ ఇలాగే జరిగింది.  బాహుబలికి సైడ్ ఇచ్చేసి, శ్రీమంతుడు మూవీని నెల ఆలస్యంగా రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ కాబోతుంది.
Mahesh Babu, AR Murugadoss' film
ఇక మ‌రో విష‌య‌మేమంటే జూన్‌లో వాన‌లు, బడులు మొదలవుతాయి కాబ‌ట్టి, సినిమాను మే నెలలోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డం ఉత్త‌మ‌మని కూడా నిర్మాత‌లు భావిస్తున్నారట.  ఫైనల్ గా నిర్మాతలు ఎటు వైపు మొగ్గు చూపుతారో చూడాలి మరి. మొత్తానికి బాహుబలి2 ఎఫెక్ట్ తో మహేష్ సినిమా రిలీజ్ పెద్ద కష్టాలే వచ్చిపడ్డాయి.

- Advertisement -