రాహుల్ నాయకత్వంపై డౌటే ?

54
- Advertisement -

కేంద్రంలో బీజేపీని గద్దె దించాలనే టార్గెట్ తో విపక్షాలన్నీ ఏకం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐక్యత కోసం ఆయా పార్టీల అధినేతలు గట్టిగానే కసరత్తులు చేస్తున్నారు. విపక్షాలు విడిగా పోరాడితే మోడీని ఎదుర్కొలేమని, అందరూ కలిస్తేనే ఐక్యమత్యంతో బీజేపీకి చెక్ పెట్టవచ్చని కాంగ్రెస్ మొదటి నుంచి చెబుతోంది. అంతే కాకుండా విపక్షాలన్నీ ఏకమైతే.. వాటిని లీడ్ చేసే బాధ్యత తమది అంటూ హస్తం హైకమాండ్ గతంలోనే చెప్పుకొచ్చింది. అయితే చాలా పార్టీలు కాంగ్రెస్ ను నమ్మడంలో వెనుకడుగు వేశాయి. ఇదిలా ఉండగా విపక్షాలను ఏకం చేసే బాధ్యత బిహార్ సి‌ఎం నితిశ్ కుమార్ తన భుజాలపై వేసుకున్నారు. .

ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా బలమైన నేతలను కలుస్తూ ఐక్యతను సూచించారు. ఈ నేపథ్యంలో నితిశ్ కుమార్ అధ్యక్షతన ఇటీవల పాట్నాలో దాదాపు 22 విపక్ష పార్టీలు సమావేశానికి హాజరు అయ్యాయి. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేజ్రీవాల్, స్టాలిన్, అఖిలేశ్ యాదవ్, శరత్ పవార్.. వంటి ఎందరో అగ్రనేతలు హాజరు అయ్యారు. కాగా ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు విపక్షాలు తీసుకున్నాయనే దానిపై స్పష్టమన సమాచారం లేనప్పటికి ముఖ్యంగా విపక్షాలను లీడ్ చేసే నాయకత్వంపై చర్చ జరిగి ఉండే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం. అంటే విపక్షాల తరుపున ప్రధాని అభ్యర్థి ఎవరనేది కొంత చర్చకు వచ్చే ఉంటుంది.

Also Read: టార్గెట్ 300.. బీజేపీకి ఈసారి కష్టమే ?

నితీశ్ కుమార్, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్.. వీరంతా కూడా పీ‌ఎం పదవి కోసం ఆశగా ఉన్నవాళ్ళే. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు పెరుగుతున్న మద్దతు కారణంగా విపక్షాల తరుపున రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా నియమించాలనే ప్రతిపాదనను హస్తం పార్టీ సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై కొన్ని పార్టీల నేతలు సానుకూలంగా స్పందిస్తే.. మరికొన్ని పార్టీల నేతలు ప్రతికూలంగా స్పందించారట. స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్ వంటి వాళ్ళు రాహుల్ నాయకత్వానికి మద్దతు ఇవ్వడం లేదని టాక్. డిల్లీ ఆర్డినెన్స్ విషయంలో మద్దతుగా నిలిస్తేనే రాహుల్ నాయకత్వాన్ని స్వాగతిస్తామని ఆప్ నేతలు చెబుతున్నారు. దీంతో విపక్షాల తరుపున రాహుల్ నాయత్వంపై అసంబద్దత ఏర్పడినట్లే కనిపిస్తోంది. ఆప్ కు తోడు మరికొన్ని పార్టీలు కూడా రాహుల్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తే.. విపక్ష కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మరి హస్తం పార్టీ ఏం చేస్తుందో చూడాలి.

Also Read: KTR:పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించాలి

- Advertisement -