Rahul:హత్రాస్ బాధితులకు అండగా ఉంటాం

23
- Advertisement -

హత్రాస్ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని తెలిపారు. అలీఘర్‌లోని పిల్ఖానాలో ఛోటే లాల్ భార్య మంజు, ఛోటే లాల్ కుమారుడు పంకజ్, ప్రేమవతి, ప్రమాదంలో మరణించిన విజయ్ సింగ్ భార్య శాంతి దేవి కుటుంబాలను కలుసుకున్నారు.

ఈ నెల 2న హత్రాస్‌ జిల్లాలోని పూల్‌రాయ్‌ గ్రామంలో నిర్వహించిన సత్సంగ్‌ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కు 121 మంది మృతిచెందగా వందలాదిమంది గాయపడ్డారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ న్యాయ విచారణకు ఆదేశించారు. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన భోలే బాబా పరారీలో ఉన్న విషయం తెలిసిందే.

Also Read:TTD:9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

- Advertisement -