- Advertisement -
కాంగ్రెస్ నేత రాహూల్‌గాంధీ ప్రధాని మోదీకి ఐదు అంశాలను ట్వీటర్ ద్వారా విమర్శించారు. ప్రధాని మోదీ దేశానికి, ప్రజలకు నిజాన్ని దాచి పెడుతున్నారని కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ట్వీటర్లో పేర్కొన్నారు. చైనా అంటే భయపడుతున్నారని. తన ఇమేజ్ను పెంచుకొవడానికి దేశ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. సరిహద్దు విషయంలో చైనాకు భయపడుతూ సైన్యం నైతిక బలాన్ని కొల్పోయేలా చేస్తున్నారన్నారు. ప్రధాని మౌనం దేశానికి చాలా హానికరమన్నాయన… దేశ భద్రతతో ఆడుకుంటున్నారని విమర్శించారు. గత రెండు సంవత్సరాల నుంచి యధేచ్ఛగా చైనా చొరబాట్లు చేస్తున్న వాటిని సమర్థంగా తిప్పి కొట్టడంలో విఫలమవుతున్నారని ఘాటుగా స్పందించారు. దేశ ప్రజలకు తప్పకుండా నిజాలు చెప్పాలన్నారు.
- Advertisement -