వయనాడ్‌కు రాహుల్ బైబై!

8
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తాచాటిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలకు మించి సత్తాచాటింది ఇండియా కూటమి. ఇక కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. 99 సీట్లు దక్కించుకుని బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా నిలిచింది.

ఇక పోటీ చేసిన రెండు స్థానాల నుండి గెలుపొందారు రాహుల్. కేరళలోని వయనాడ్‌తో పాటు యూపీలోని రాయ్‌బరేలి నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు రాహుల్ ఏ స్థానాన్ని వదులుకుంటారు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది.

అయితే కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం వయనాడ్‌ను వదులుకునేందుకు రాహుల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే యూపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశలో భాగంగా రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగనున్నారట. ఎందుకంటే యూపీలో 80 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న యూపీ కీలకం. అందుకే రాహుల్ యూపీ నుండే ఎంపీగా కొనసాగనున్నారని తెలుస్తోంది. యూపీలో ఇండియా కూటమి సత్తాచాటిన సంగతి తెలిసిందే. సమాజ్‌వాది పార్టీ 36 స్థానాల్లో గెలుపొందగా కాంగ్రెస్ సైతం అనూహ్యంగా పుంజుకుని ఆరు స్థానాల్లో విజయం సాధించింది. అందుకే యూపీపై దృష్టిసారించారు రాహుల్.

Also Read:పవన్ ‘తమ్ముడు’ రీ రిలీజ్!

- Advertisement -