గత కొద్ది రోజులుగా పెట్రోలు, డిజిల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. పెట్రోల్ , డిజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తున్నాయి. పలువురు ప్రజా ప్రజానిధులు బీజేపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. గత నెలరోజుల్లోనే రూ.6 నుంచి రూ. 7 వరకూ పెంచారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలను తగ్గిస్తున్నామంటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ నేడు ఒక్క పైసా తగ్గిస్తున్నామంటూ ప్రకటన చేసింది.
దీంతో ఒక్క పైసా తగ్గించడం ఏంటి అని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇంత భారీగా ధరలు పెంచి పైసా తగ్గిస్తారా అంటూ ప్రజలు మండిపడుతున్నారుఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్టర్ లో స్పందించారు. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. డియర్ మోడీ అంటూ కామెంట్ చేశారు. ఒక్క పైసా తగ్గిస్తారా అంటూ మండిపడ్డారు. ఇది మోడీ ఐడియా అయితే చిన్నపిల్లల ఆలోచనలా ఉందన్నారు. ఏ మాత్రం పరిణితి లేని చర్యలా ఉందిస రాహుల్ ట్వీ్ట్ చేశారు.
నేను మీకు విసిరిన ప్యూయల్ ఛాలెంజ్ పై మీ స్పందన ఇదా అంటూ ట్వీట్ చేశారు. గతంలో విరాట్ కోహ్లి ఫిట్నెస్ చాలెంజ్‌ను ప్రధాని మోదీ స్వీకరించిన విషయం తెలిసిందే. మోదీకి రాహుల్ ట్వీట్ చేస్తూ ప్రెట్రోల్ చార్జిలపై తన సవాలును స్వీకరించాలని మోడీ రాహుల్ కు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇలా ఒక్కపైసా తగ్గించడం సరైందికాదన్నారు రాహుల్ గాంధీ.
Dear PM,
You've cut the price of Petrol and Diesel today by 1 paisa. ONE paisa!??
If this is your idea of a prank, it’s childish and in poor taste.
P.S. A ONE paisa cut is not a suitable response to the #FuelChallenge I threw you last week. https://t.co/u7xzbUUjDS
— Rahul Gandhi (@RahulGandhi) May 30, 2018