ప్లేట్లు కడిగిన సోనియా, రాహుల్.. వీడియో వైరల్‌

243
Sonia Gandhi
- Advertisement -

ఈ రోజు భారత జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను విశ్వవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చెప్పిన మాటలను అక్షరాలా ఆచరించారు. గాంధీ జయంత్యుత్సవాల సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలోని సేవాగ్రామ్(బాపుకుటిర్) ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రార్థనా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాహుల్, సోనియాలు పాల్గొని అనంతరం అక్కడే భోజనం చేశారు.

భోజనానంతరం సోనియా, రాహుల్ వారి కంచాలను వారే స్వయంగా శుభ్రం చేశారు. ఎవరి సొంత పనులు వారే స్వయంగా చేసుకోవాలన్న మహాత్ముని మాటలను అక్షరాలా ఆచరణలో పెట్టారు.తమ ప్లేట్లను తామే కడిగి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఇది గమనించిన మిగతా కాంగ్రెస్ నేతలు ఎవరి ప్లేట్లను వారే శుభ్రంగా కడిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -