పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ కమెడియన్..!

281
- Advertisement -

చిత్ర పరిశ్రమలోకి చాలా మంది నటీనటులు వస్తుంటారు. ఇండస్ట్రీలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కుని నిలబడడం చాలా కష్టం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. సినిమాల్లో నటించాలన్న ఫ్యాషన్‌తో చాలా మంది సర్దుకుపోతుంటారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, “అర్జున్ రెడ్డి” సినిమాతో మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ. “సైన్మా” అనే షార్ట్ ఫిలింతో అందరి దృష్టిలో పడ్డ రాహుల్.. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

“అర్జున్ రెడ్డి” తర్వాత “భరత్ అనే నేను”, “సమ్మోహనం” ఇటీవల విడుదలైన “గీత గోవిదం” మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్ట్ చేసి తన కామెడితో ప్రేక్షకులను నవ్వించాడు. అయితే.. త్వరలోనే ఈయన పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన రాహుల్ రామకృష్ణ పెళ్లి చేసుకోబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తనకు కాబోయే భార్యతో దిగిన ఫోటోను పోస్ట్ చేసి.. “ఎవరికీ చెప్పకండి” అంటూ రాహుల్ కామెంట్ పెట్టాడు.

అయితే రాహుల్ పోస్ట్ చేసిన ఫోటోలో వీరి మొహాలు సరిగ్గా కనిపించకపోవడంతో పెళ్లి కూతురు ఎవరనేది సస్పెండ్‌గా మారింది. తనకు కాబోయే భార్యతో బీచ్ పక్కన దిగిన ఫోటోను రాహుల్ షేర్ చేశాడు. ఇక త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న రాహుల్‌కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.

- Advertisement -