రాహుల్‌ ‘హగ్’‌… కహానీ

227
rahul modi hug
- Advertisement -

విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ విఫలమైందని ఆరోపిస్తూ టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రసంగం ఆధ్యాంతం మోడీపై విమర్శలు గుప్పించిన రాహుల్ చివర్లో మాత్రం ప్రధానిని హగ్ చేసుకున్నారు. తర్వాత తన సీటులో కూర్చుని కన్నుకొట్టడం చర్చనీయాంశంగా మారింది.

రాహుల్‌ హగ్‌ హైలైట్‌గా నిలవడమే కాదు సోషల్ మీడియా,అన్ని పేపర్లలో బ్యానర్‌ ఐటంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సైతం రాహుల్ సడన్‌ సర్‌ప్రైజ్ చూసి ఆశ్చర్యపోయారు.

అయితే, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి రాహుల్‌ హగ్ ఇవ్వడం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదట. కొన్నినెలలుగా మోడీకి హగ్ ఇచ్చేందుకు రాహుల్ ఎదురుచూస్తున్నారని సమాచారం. కొద్దిరోజుల క్రితం ఓ సభలో మోడీ గాంధీ కుటుంబంతో పాటు సోనియాపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో మోడీకి సరైన సమాధానం ఇచ్చేందుకు రాహుల్ సిద్దమయ్యారట. ఇందుకు శంకర్ దాబా ఎంబీబీఎస్ తరహాలో హగ్ ఇచ్చి కౌంటర్ ఇచ్చేందుకు రాహుల్ సిద్ధమయ్యారని ..అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధానికి హగ్ ఇచ్చి ఆశ్చర్య పరిచారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.

- Advertisement -