ఆల్‌ టైం రికార్డు..8 లక్షల మెజార్టీతో రాహుల్‌ గెలుపు

190
rahul

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూపీలోని అమేధి,కేరళలోని వయనాడ్‌ నుండి పోటీచేసిన రాహుల్‌ అమేథిలో వెనుకంజలో ఉండగా వయనాడ్‌లో మాత్రం ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. గతంలో ఉన్న రికార్డులన్నీ చెరిపివేసి అత్యంత మెజారిటీతో గెలిచిన ఎంపీగా పార్లమెంట్‌లో రాహుల్ అడుగుపెట్టబోతున్నారు.

అధికార ఎల్‌డీఎప్‌ అభ్యర్ధిపై 8లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. రాహుల్ గాంధీ 13,37,438 ఓట్లు రాగా ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి పీపీ సునీర్‌కు 4,99,067 ఓట్లు లభించాయి. 8,38,371 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఏకైక ఎంపీగా రాహుల్ రికార్డు సృష్టించారు.

2014లో ఉప ఎన్నికలో బీజేపీ నేత ప్రితమ్ గోపీనాథ్‌రావు ముండే ..కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.పాటిల్‌పై ఆయన 6,96,321 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి సీపీఎం అభ్యర్థి అనిల్ బసు 5,92,502 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ రికార్డులన్నింటిని తిరగరాసిన రాహుల్ భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తిగా రికార్డుసృష్టించారు.