కొత్త వివాదంలో రాహుల్..

163
- Advertisement -

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో వివాదానికి కారణమయ్యారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అయితే అక్కడ హిందువులు కాని వారు మాత్రమే అక్కడున్న రిజిస్టర్‌లో తమ వివరాలు రాస్తారు. కానీ రాహుల్ ఆ రిజిస్టర్‌లో తన వివరాలన్ని ఎంట్రీ చేశారు.

దీంతో తాను హిందువు కాదా అన్న కొత్త అనుమానాలకు రాహుల్ తెర లేపినట్లయింది. రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌ల దాడి మొద‌లుపెట్టారు. ఓట్ల‌ కోస‌మే రాహుల్ గుడుల చుట్టూ తిరుగుతున్నార‌ని మండిపడ్డారు.

 Rahul Gandhi visits Somnath temple, register entry sparks controversy ..

కాగా.. కొన్ని రోజులుగా దేవాల‌యాల‌కు వెళ్లి పూజ‌ల్లో పాల్గొంటోన్న రాహుల్ గాంధీపై ఇప్ప‌టికే బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. త‌మ పార్టీపై ఉన్న‌ హిందూ వ్య‌తిరేక ముద్ర‌ను కప్పిపుచ్చుకోవ‌డానికే రాహుల్ దేవాల‌యాల‌కు వెళ్తున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

అయితే రాహుల్ గాంధీ రిజిస్ట‌ర్‌లో వివరాలన్ని ఎంట్రీ చేశాడనేది బీజేపీ కుట్ర అంటూ విమ‌ర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రిజిస్ట‌ర్‌లో రాహుల్ గాంధీ జీ అని సంత‌కం చేశార‌ని, ఆయ‌న జీ అంటూ ఎందుకు సంత‌కం చేస్తార‌ని కాంగ్రెస్ నేత దీపేంద్ర హుడా ప్ర‌శ్నించారు.

- Advertisement -