వయనాడ్ బరిలో ప్రియాంక

5
- Advertisement -

కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానంతో పాటు రాయ్‌బరేలీ నుండి గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. వయనాడ్ స్థానానికి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.

వయనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని చెప్పారు. తనను వయనాడ్ ప్రజలు ఎంతగానో అభిమానించారని …వయనాడ్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చెప్పారు.

రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ కంచుకోట. 1951 నుంచి ఈ సెగ్మెంట్‌లో కేవలం మూడుసార్లు మాత్రమే హస్తం పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. ఇందిరాగాంధీ మూడుసార్లు ,ఫిరోజ్‌ గాంధీ రెండుసార్లు ,ఐదుసార్లు సోనియా గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ విజయం సాధించారు.

Also Read:మహారాజకి అద్భుతమైన రెస్పాన్స్

- Advertisement -