మోదీకి థాంక్స్ చెప్పిన రాహుల్…

72
modi
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి థాంక్స్ చెప్పారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ గత ఐదేళ్లలో దేశంలో 2.1 కోట్ల ఉద్యోగాలు పోయాయని, 45 కోట్ల మంది ప్రజలు ఉద్యోగం కోసం వెతకడం మానేశారని మోడీకి చురకలంటించారు.

75 ఏళ్లలో ఇలాంటివి చేసిన తొలి ప్రధాని మోడీ అని విమర్శించారు. ప్రతి ఇంట్లో నిరుద్యోగం ఉంది… 75 ఏళ్లలో 45 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు పొందాలనే ఆశను కోల్పోయేలా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మాస్టర్ స్ట్రోక్స్ ఇచ్చారని ఇందుకు ప్రధానికి థాంక్స్ చెప్పాల్సిందే అన్నారు.

సిబిఎస్ఇ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ అణిచివేత విద్య అంటూ కేంద్ర సర్కార్‌పై మండిపడ్డారు. పాఠ్యాంశాల్లో సిలబస్ మార్పుపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను లక్ష్యంగా చేసుకున్న రాహుల్..ఆర్ఎస్ఎస్ అంటే ‘రాష్ట్రీయ శిక్షా శ్రేద్దర్’ అంటూ ఎద్దేవా చేశాడు.

- Advertisement -