Rahul:దేశంలో ఇంకా కుల వివక్ష ఉంది

2
- Advertisement -

ఈ దేశంలో ఇంకా కుల వివక్ష ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీసీ కులగణన దేశవ్యాప్తంగా చేపట్టాలన్నారు. కుల గణనకు సకల జనులకు ఆదరణ తెలపాలన్నారు రాహుల్ గాంధీ. సామజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుటుంబ సర్వే పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన నిర్వహించిన కుల గణన సంప్రదింపుల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రాహుల్ గాంధీ.

ఈ దేశంలో కులాలు ఉన్నాయి. అదేవిధంగా కుల వివక్షలు ఉన్నాయని కూడా అందరికీ తెలుసు అన్నారు కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. తాను ఈ నిజాలు మాట్లాడితే దేశాన్ని విభజిస్తున్నానని పీఎం నరేంద్ర మోడీ, బీజేపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు అని మండిపడ్డారు.

టైటానిక్ నిర్మించినపుడు దాని రూపకర్త అది మునిగిపోదని చెప్పాడు. కానీ అది కేవలం ఒక వారం తర్వాత మునిగిపోయిందన్నారు. మంచు కొండలను గుర్తించే బాధ్యత కలిగిన వ్యక్తి దానిని చూడలేకపోయాడు. మంచు కొండను ఢీకొన్న తర్వాత టైటానిక్‌ మునిగిపోయింది.  భారతదేశంలోని కుల వివక్ష ఈ మంచు కొండను పోలి ఉంటుంది, దానిలో ఎక్కువ భాగం దాగి ఉంటుంది. ఇది వివిధ కారణాల చేత కనపడకుండా ఉందని తెలిపారు.

Also Read:పంబా నది టూ శబరిమల..రోప్ వే

- Advertisement -