- Advertisement -
బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులో 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. గుజరాత్‌లో రేపిస్టులను విడుదల చేసి గౌరవించింది. క్రిమినల్స్‌కు బీజేపీ మద్దతు ఇస్తుండటాన్నిబట్టి, మహిళల విషయంలో ఆ పార్టీ ఎలాంటి సంకుచిత వైఖరితో ఉందో అర్థమవుతుందని మండిపడ్డారు రాహుల్.
మోదీజీ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నందుకు సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. అత్యాచారం, హత్య చేసిన నిందితులను విడుదల చేయడం ద్వారా గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం బాధితురాలైన బిల్కిస్ బానో కుటుంబానికే కాదు.. మొత్తం సమాజానికే బాధ కలిగించిందని దుయ్యబట్టారు.
ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిల్కిస్ బానోపై అత్యాచారం చేయడంతోపాటు, ఆమె కుటుంబ సభ్యులను చంపిన 11 మంది ఖైదీలు విడుదలైన సంగతిత తెలిసిందే.
- Advertisement -