ఎక్కడ కొల్పోయామో..అక్కడి నుండే ప్రారంభిస్తాం!

25
- Advertisement -

ఎక్కడ నుండి కొల్పోయామో..అక్కడి నుండి ప్రారంభిస్తామని చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రేసు ఎక్కడ ఆపామో అక్కడి నుంచే మొదలు పెట్టాలని, గుజరాత్ లో 30 ఏళ్ల తర్వాత మళ్లీ 2027లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. తాను, తన సోదరితో పాటు పార్టీ నాయకత్వం అంతా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు మద్దతుగా ఉంటుందన్నారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడిన రాహుల్… రామమందిర ప్రారంభోత్సవంలో పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీ కనపడ్డారని, కానీ ఒక్క పేదవాడూ కనపడలేదని అన్నారు. అయోధ్యంలో ఇండియా కూటమి విజయం సాధించిందన్నారు.

బీజేపీ తమ ఆఫీసుని ఎలా కూల్చివేసిందో తాము అలాగే ఆ ప్రభుత్వాన్ని కూల్చనున్నామని చెప్పారు. 2017లో ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి బాగా పనిచేశామని, ఫలితాలు బాగా వచ్చాయని తెలిపారు.

Also Read:షూటింగ్ చివరి దశలో..సరిపోదా శనివారం

- Advertisement -