భారత్ జోడో యాత్రలో భాగంగా పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఎంపీ రాహుల్ గాంధీ. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. తన నానమ్మ ఇందిర వంటి మంచి లక్షణాలున్న అమ్మాయి అయి ఉండాలని, అమ్మ, నానమ్మలోని మిశ్రమ లక్షణాలుంటే మరీ మంచిదన్నారు. ఇందిరా గాంధీ గురించి ప్రముఖంగా ప్రస్తావించిన కాంగ్రెస్ ఎంపీ.. నానమ్మ అంటే తనకెంతో ప్రేమని, ఆమె తనకు మరో మాతృమూర్తిలాంటి వారన్నారు.
జీవిత భాగస్వామి ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు ..ఇది ఆసక్తికర ప్రశ్న.. నానమ్మ వంటి సుగుణాలున్న మహిళ అయితే నాకు అభ్యంతరం లేదు. కానీ, అమ్మ, నానమ్మలో ఉన్న మిశ్రమ లక్షణాలు కలిగినవారైతే ఇంకా మంచిదని చెప్పుకొచ్చారు రాహుల్.
వాహనాలపై తన అభిరుచులను వెల్లడించిన రాహుల్…తనకు కార్లపై అంతగా అంతగా ఇష్టం ఉండదన్నారు. సొంతకారు కూడా లేదు.. ఇంట్లో సీఆర్-వీ ఉన్నా.. అది అమ్మది అని చెప్పారు.
ఇవి కూడా చదవండి..