వన్ మ్యాన్.. వన్ ఓట్ కోసమే మా ఉద్యమం అన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కోసం ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్నాయని, స్పష్టమైన ఓటర్ల జాబితాను విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఓ నియోజకవర్గ సర్వే దాదాపు లక్ష నకిలీ ఓట్లుగా తేలాయి అన్నారు. ఇది రాజకీయ పోరాటం కాదు.. రాజ్యంగ పరిరక్షణ కోసం పోరాడుతున్నాం … ఈ నిజం దేశం ముందున్నా .. ఎన్నికల సంఘం మాత్రం దీనిపై మౌనం వహించడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు.
నకిలీ ఓటర్ల నమోదులో బీజేపీ-ఈసీ కుట్రను నిరసిస్తూ ఆందోళన చేపట్టింది ఇండియా కూటమి. రాహుల్ గాంధీ ర్యాలీకి మద్దతుగా పెద్ద ఎత్తున విపక్ష ఎంపీలు పాల్గొన్నారు. నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు.
Also Read:హామీలను అమలు చేయండి:కోమటిరెడ్డి

