కాంగ్రెస్ ఓటర్లే లక్ష్యంగా ఓటు చోరి

6
- Advertisement -

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవారిని ఎన్నికల సంఘం కాపాడుతోందంటూ ధ్వజమెత్తారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఢిల్లీలోని ఇందిరా భవన్‌ ఆడిటోరియంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ… ఓటు చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేల్చుతానని ఇప్పటికే రాహుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఉద్దేశపూర్వకంగా లక్షల ఓట్లను తొలగించారని విమర్శించిన రాహుల్… కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పెద్దఎత్తున ఓటు చోరీ జరిగిందని మరోసారి ఆరోపించారు. ఇవన్నీ ఆరోపణలు కాదు, పక్కా ఆధారాలతో చెబుతున్నానని స్పష్టం చేశారు.

మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ నియోజకవర్గంలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారు అన్నారు. చాలా ప్రాంతాల్లో మైనార్టీలు, ఆదివాసీల ఓట్లు తొలగిస్తున్నారు..కేవలం కాంగ్రెస్ ఓటర్లే లక్ష్యంగా ఓట్లు తొలగించారు అన్నారు రాహుల్.

Also Read:రైతుల కోసం..ఎమ్మెల్యే రూ.2కోట్ల విరాళం!

- Advertisement -